September 4, 2026
Explore
తరిగొండ గ్రామంలో “పల్లెనిద్ర” కార్యక్రమం

తరిగొండ గ్రామంలో “పల్లెనిద్ర” కార్యక్రమం

September 4, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మరియు రాయచోటి SDPO కృష్ణ మోహన్ ఆదేశాల మేరకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామంలో వాయల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు “పల్లెనిద్ర” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వాయల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాఘవరెడ్డి , గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

అనంతరం తరిగొండ గ్రామ పరిధిలోని తరిగొండవారిపల్లి, ఎగువ హరిజనవాడ, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాలను సందర్శించి ప్రజలకు మహిళల భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రత, డ్రగ్స్ మరియు గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆస్తి నేరాల నివారణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి గొడవలు, వివాదాలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడరాదని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.

అనంతరం తరిగొండ గ్రామంలోని ప్రధాన వీధులు, ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు.

Tags: “Palle Nidra” (Village Night-stay) program in Tarigonda village.