March 8, 2026
Explore
మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానం: అంజూరు తారక శ్రీనివాసులు

మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానం: అంజూరు తారక శ్రీనివాసులు

March 8, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు మరియు నాయకులకు ఘన వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగాఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మహిళా నాయకుల మధ్య కేక్ కట్ చేసి, వారిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు గారు మాట్లాడుతూ..”మహిళలు లేకపోతే విశ్వమే లేదు. అమృతమైన ఈ సృష్టికి మూల కారణం అమ్మ. మహిళా దినోత్సవం అని ఒక రోజుకే పరిమితం చేయకుండా, ప్రతిరోజూ వారిని గౌరవించుకోవాలి, స్మరించుకోవాలి” అని పేర్కొన్నారు.
కార్మిక వ్యవస్థలో కూడా మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం, నాయకత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, వారందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మహిళలు కేవలం సామాజికంగానే కాక, ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎదిగినప్పుడే దేశం నిజమైన పురోగతి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
“మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం, చివరకు దేశం కూడా అభివృద్ధి పథంలో నడుస్తాయి” అని వ్యాఖ్యానించారు.మానవాళిలో సగభాగంగా ఉన్న మహిళలు, అభివృద్ధిలో అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం మరియు అభ్యున్నతే ఏ సమాజ ప్రగతికైనా కీలకమైన కొలమానమని శ్రీనివాసులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు, డిపో కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసకుమార్,డిపో అధ్యక్షుడుg p s ఆచారి,నిర్మల, గురవమ్మ,b j లక్ష్మి , సరస్వతి, రాధిక, భవాని,కుప్పయ్య, టి ఎల్ మూర్తి, చంద్ర, పట్టాభి,ఈశ్వరయ్య, రామకృష్ణ, ఎంఎస్ మన్యం, ఓ కుమార్, మురళి, కె ఆర్ కృష్ణ, గంగాధరమ్,మహిళా కార్మికులు మరియు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: The advancement of women is the measure of the progress of society: Anjuru Taraka Srinivasulu