పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని కమతంపల్లెలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు హేమచంద్ర ఆధ్వర్యంలో వడ్డెర విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది బేబిరాణి ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా హేమచంద్ర మాట్లాడుతూ వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చి , చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వడ్డెరలను సామాజిక , ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
Tags: Vaddera Liberation Day