August 31, 2026
Explore
హాస్టల్ భవనాలు అప్పగించాలని పీజీఆర్‌ఎస్‌లో విద్యార్థుల ఫిర్యాదు

హాస్టల్ భవనాలు అప్పగించాలని పీజీఆర్‌ఎస్‌లో విద్యార్థుల ఫిర్యాదు

August 31, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ హాస్టల్ భవనాలను తిరిగి అప్పగించాలని కోరుతూ సోమవారం PGRSలో ఆర్డీవో శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు.

అఖిల భారత స్టూడెంట్స్ పవర్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు ఈ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 250 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ హాస్టళ్లకు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. తక్షణం హాస్టల్ భవనాలను విద్యార్థులకు అప్పగించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కిరణ్ కుమార్ హెచ్చరించారు.

Tags: Students lodge complaint via PGRS seeking handover of hostel buildings.