మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌పై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అర్జీలు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగళ్లలో తాగునీరు, రేషన్ షాప్ ఏర్పాటు, భూ సమస్యలపై ప్రజలు కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. మొత్తం 316 అర్జీలు అందగా సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం ఎండార్స్ చేశారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. IVRS ద్వారా ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాల్లో జిల్లాను మెరుగైన స్థానంలో నిలపాలని అన్నారు. ప్రతి శాఖ అధికారి తమ శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Tags: 316 petitions in PGRS… must be resolved on time.