August 31, 2026
Explore
ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 71 ఫిర్యాదులు

ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 71 ఫిర్యాదులు

August 31, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ధీరజ్ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 71 ఫిర్యాదులు అందగా, 30 భూ వివాదాలు, 10 ఆర్థిక వివాదాలు, 10 ఘర్షణలు/న్యూసెన్స్‌కు సంబంధించినవి ఉన్నాయి.
మోసం, సైబర్‌ నేరాలకు 7, కుటుంబ వివాదాలకు 6, ఇతర సమస్యలకు 5, పరిపాలనకు సంబంధించిన 3 ఫిర్యాదులు వచ్చాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

Tags: 71 complaints at the SP’s public grievance redressal forum.