August 6, 2026
Explore
ప్రజలు స్నేహబావంతో మెలగాలి – జడ్జి ఆరీఫాషేక్‌

ప్రజలు స్నేహబావంతో మెలగాలి – జడ్జి ఆరీఫాషేక్‌

August 6, 2026 | Uncategorized

పుంగనూరుముచ్చట్లు:

కేసులు పరిష్కారంలో ప్రజలు స్నేహభావంతో మెలిగి , కేసులను పరిష్కరించుకోవాలని, ఇందుకోసం మధ్యవర్తిత్వం సహాయం తీసుకోవాలని సీనియర్‌ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్‌ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్‌అదాలత్‌లు నిర్వహించడం జరుగుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకే లోక్‌అదాలత్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేసులు పరిష్కారంతో ప్రజలు ఎలాంటి కక్షలు లేకుండ శాంతియుత వాతావరణంలో ఎవరికి వారు తమ కుటుంభాలతో జీవించేందుకు వీలౌతుందన్నారు. ముఖ్యంగా కేసులు లేకపోతే వారి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రజలు పట్టింపులకు పోకుండ స్నేహంతో సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

Tags: People should conduct themselves in a spirit of friendship – Judge Arifa Sheikh.