August 29, 2026
Explore
శ్రీ బోయకొండ గంగమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట

శ్రీ బోయకొండ గంగమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని బండ్లపల్లె గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట , కుంభాభిషేకం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఉదయం నుంచి అష్టబంధన, హ్గమాలు, అభిషేకాలు, పూర్ణాహుతి, అష్టావదానసేవ, గోవుదర్శనం , సప్తకన్యల దర్శనం, మహా మంగళ హారతులతో అమ్మవారిని ప్రతిష్టించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఆదివారం అమ్మవారికి ప్రాణప్రతిష్ట నిర్వహించి , అనంతరం అల్పాహార విందు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Tags: Sri Boyakonda Gangamma’s new statue unveiled