August 29, 2026
Explore
70 ఏళ్ల వృద్ధురాలి కన్నీటి గోడు

70 ఏళ్ల వృద్ధురాలి కన్నీటి గోడు

August 29, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:


-చీకట్లోనే బతుకీడుస్తూన్న దళిత వృద్దురాలు
-ఇల్లు వదిలి పెట్టకపోతే చంపేస్తామని అధికార పార్టీ నేతలు వార్నింగ్ ఇవ్వడంతో కన్నీటి పర్వతం

  • అధికారం ఉపయోగించి కరెంటు తొలగించడంతో చీకట్లో కాలం వెలదీస్తున్న బాధితురాలు….

అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్సార్ కాలనీలో 15 ఏళ్లుగా ఉంటున్న 70 ఏళ్ల కొండమరి లక్ష్మమ్మ దయనీయ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది.

డోర్ నెం.AA-27-441లో పన్ను, కరెంట్ బిల్లు (5211700086086) కడుతూ నివసిస్తున్న ఆమె ఇంటిని కబ్జా చేసేందుకు కరెంట్ మీటర్ పీకేసి, జేసీబీతో కూలుస్తామని బెదిరిస్తున్నా రట. కలెక్టర్ ఎస్పీ స్థాయి అధికారులు స్పందించి వెంటనే బాధితురాలికి న్యాయం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

వీడియోలో దీపం వెలుగులో ఆధార్, బిల్లు పత్రాలు పట్టుకుని చీకట్లో వణుకుతూ నిలబడిన లక్ష్మమ్మను చూస్తే మానవత్వమే సిగ్గుపడుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఆ తల్లికి వెలుగు నింపాలి.

Tags: The tearful plight of a 70-year-old woman