August 29, 2026
Explore
వండాడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మృతి చెందిన వ్యక్తి ఎవరంటే?

వండాడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మృతి చెందిన వ్యక్తి ఎవరంటే?

August 29, 2026 | Andhra Pradesh

చిన్నమండెం ముచ్చట్లు:

చిన్నమండెం మండలం వండాడి వద్ద శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రైల్వే కోడూరు నియోజకవర్గం అంకమ్మనగర్‌కు చెందిన పత్తి సుధాకర్‌గా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై చిన్నమండెం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags: Horrific road accident near Vandadi… Who is the deceased?