మదనపల్లె ముచ్చట్లు:
– నిబంధనలు మీరితే కఠిన చర్యలు: – జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
ఈ నెల 30న ఆదివారం మదనపల్లె (మిట్స్, ఆదిత్య), రాయచోటి (శ్రీ సాయి, భాస్కర్) ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.30 వరకు నీట్ – పీజీ పరీక్ష జరుగుతుంది; ఉదయం 8.30 గంటల తర్వాత ఎవరినీ అనుమతించరు.
భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల చుట్టూ 200-300 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుంది; ఆ పరిధిలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలి.
కేంద్రాల్లోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం; పేపర్ లీక్ వదంతులు సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Tags: Heavy security arrangements for the ‘NEET-PG’ exam to be held on the 30th