అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల జారీలో జాప్యం కొనసాగుతోంది. మార్చి నుంచి న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కొత్త డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు రీఫిల్స్ అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొత్త కనెక్షన్లు యధావిధిగా జారీ చేస్తామని పేర్కొంది. ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి పవన్ సోని మాట్లాడుతూ, గ్యాస్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కొత్త కనెక్షన్లు జారీ చేస్తామని తెలిపారు.
Tags; Is a wait inevitable for new gas connections?