అమరావతిముచ్చట్లు:
పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొత్త ఈవీలు కొనడానికి అధిక డబ్బు అవసరం. దీనికి పరిష్కారంగా, పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే ‘రెట్రోఫిట్’ విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆటోలకు ఈ మార్పులు తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. రెట్రోఫిట్ విధానంలో ఈవీ కిట్లు అమర్చుకునే వాహనాలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. వాహన ఇంజిన్ లేదా ఇంధన వ్యవస్థను మార్చి కొత్త సాంకేతికతను బిగించడమే రెట్రోఫిట్. రోజూ 50 కి.మీ. పైగా తిరిగే, 7-8 ఏళ్లు దాటిన, మంచి కండిషన్‌లో ఉన్న వాహనాలకు ఇది లాభదాయకం.
Tags; Do you want to convert your petrol/diesel vehicle into an EV?