.. భవిష్యత్తు చేతిలో ఉంటేనే అసలైన హీరోలు
వరదయ్యపాలెంలో మైనర్ యువకుల,విద్యార్థుల బైక్ రైడింగ్‌పై ఎవరి బాధ్యత?
సత్యవేడు ముచ్చట్లు:
తల్లిదండ్రుల ముచ్చటాపిల్లల మూర్ఖపు సరదానా.అధికారుల నిర్లక్ష్యమాప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది
*చిన్న వయసుచేతిలో బైక్.కళ్ల ముందు రోడ్డు… మనసులో వేగం… చుట్టూ స్నేహితులు… ఇక తమను తాము హీరోలుగా ఊహించుకునే వయసు..కానీ ఆ ఒక్క క్షణం సరదా… ఒక కుటుంబం జీవితాంతం కన్నీటి కథగా మారితే.
వరదయ్యపాలెం మండల కేంద్రంలో మైనర్ విద్యార్థులు, యువకులు విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారనే ఆరోపణలు, సమాచారం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది
ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలతో పాటు కొన్ని ప్రైవేట్ పాఠశాలల వద్ద కూడా కొంతమంది విద్యార్థుల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయిబజారులో అయితే.మరి ఎక్కువ వయసుతో తేడా లేకుండా… 12 నుండి 16 సంవత్సరాల వయసు గల పిల్లలు… వాహనాలు నలుగు నడుపుతుండడం.. కోసమెరుపు
అసలు జరుగుతున్నది ఏమిటి?..లైసెన్స్ లేని మైనర్లు వాహనాలు నడపడం…అతివేగంగా ప్రయాణించడం…త్రిబుల్ రైడింగ్…ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేకపోవడం…ఇవన్నీ చిన్న విషయాలుగా తీసుకుంటే పెద్ద ప్రమాదానికి ఇదే మొదటి మెట్టు కావచ్చు.
చిన్న వయసులో సహజంగా ఉండే ఉత్సాహం, స్నేహితుల ప్రభావం, వేగంపై మోజు, తాము కూడా పెద్దవాళ్లమనే భావన… ఇవన్నీ కలిస్తే ప్రమాదం ఎంత దగ్గరలో ఉందో పిల్లలకు అర్థం కాకపోవచ్చు.
*కానీ పెద్దలకు మాత్రం అర్థం కావాలి
“నాన్నా… బైక్ కావాలి” అన్న ఒక్క మాటకు భవిష్యత్తును పణంగా పెట్టొద్దు!..
పిల్లలు అడిగారు.
మారం చేశారు
స్నేహితుల దగ్గర బైక్ ఉంది…
కాలేజీకి వెళ్లాలి
అని కొంతమంది తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
*పిల్లల కోరిక తీర్చడం ప్రేమే కావచ్చు… కానీ వారి వయసుకు మించిన స్వేచ్ఛ ఇవ్వడం ప్రేమ కాదు… ప్రమాదానికి ఆహ్వానం
తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి
“బైక్ కొని ఇవ్వడం ద్వారా నా బిడ్డ కోరిక తీర్చానా.
లేక తెలియకుండానే ప్రమాదం వైపు పంపిస్తున్నానా
పిల్లలకు మంచి చదువుమంచి ఉద్యోగంమంచి భవిష్యత్తు కావాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు.
అయితే అదే పిల్లల చేతికి వయసుకు ముందే ప్రమాదకరమైన వాహన స్వేచ్ఛ ఎందుకు ఇస్తున్నారు
తల్లిదండ్రులే వెనుక కూర్చొని పిల్లలే బైక్ నడిపిస్తుంటే… తల్లిదండ్రులు చూస్తూ ఎందుకు వస్తున్నారు?
మండల కేంద్రానికి వివిధ పనుల కోసం వచ్చే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల వెనుక కూర్చొని, పిల్లల చేతే ద్విచక్ర వాహనం నడిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తే అది కేవలం కుటుంబ వ్యవహారం కాదు.
అది రోడ్డు భద్రతకు సంబంధించిన విషయం
ఎందుకంటే రోడ్డుపై ఒక చిన్న తప్పిదం
ఒక బ్రేక్ ఆలస్యం…
ఒక వాహనం అకస్మాత్తుగా ఎదురవడం
ఒక గుంత
ఒక మలుపు
చాలు.జీవితమే మారిపోవచ్చు.
కళాశాలలో పాఠశాలల గేటు దగ్గరే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా?
తరగతులు ప్రారంభమైన తర్వాత ఆయా పాఠశాలలు, కళాశాలల పార్కింగ్ ప్రాంతాలను ఒకసారి పరిశీలిస్తే…
ఎన్ని వాహనాలు ఉన్నాయి?
ఆ వాహనాలు ఎవరివి?
వాటిపై వచ్చే విద్యార్థుల వయసెంత?
వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?
అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది…
అదేవిధంగా పాఠశాలల నుండి విద్యార్థులు తరలి వెళ్ళేటప్పుడు వారిని తీసుకొని వెళ్లే యువకులు కూడా మైనర్లు కావడం కచ్చితంగా దీనిపై దృష్టి సారించడం కూడా ఎంతైనా అవసరం ఉంది…
ఒక ప్రభుత్వ పాఠశాలకు కూడా కొంతమంది విద్యార్థులు అప్పుడప్పుడు బైక్‌లపై వస్తున్నారనే సమాచారం ఉంది.
మరోవైపు మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
అయితే పాఠశాల యాజమాన్యాలు గమనిస్తున్నాయా?
ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారా?
తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారా?
పోలీసులు ఎక్కడ. అధికారులు ఎక్కడ
జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
హెల్మెట్ ధరించాలి…
మద్యం సేవించి వాహనం నడపకూడదు…
అతివేగం ప్రమాదకరం…
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి…
అంటూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయితే మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతున్నారనే పరిస్థితి ఉంటే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా?
మద్యం సేవించి వాహనం నడిపేవారిపై చర్యలు ఎంత ముఖ్యమో…మైనర్ వాహనదారులను అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం.
*ఎందుకంటే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఒక ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది.కానీ డ్రైవింగ్ అనుభవం లేని, నిబంధనలు తెలియని మైనర్ బాలుడు కూడా ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది
అందుకే రెండింటినీ సమాన తీవ్రతతో చూడాల్సిన అవసరం ఉంది.
ఒక్క ప్రమాదం చాలు.కుటుంబం మొత్తం కుప్పకూలడానికి.
ఈరోజు బైక్‌పై నవ్వుతూ వెళ్లే పిల్లాడు
రేపు పరీక్ష రాయాల్సిన విద్యార్థి.
ఎల్లుండి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన యువకుడు.
అతని భవిష్యత్తు ఒక్క ప్రమాదంతో ఆగిపోతే.
తల్లిదండ్రుల కలలు ఎవరు తిరిగి ఇస్తారు
పిల్లల జీవితం ఎవరు తిరిగి ఇస్తారు
అందుకే ఈ సమస్యను “పిల్లల సరదా”గా తీసుకోవడం ప్రమాదకరం.
బైక్ నడపడం గొప్ప కాదు… బాధ్యతగా ఎదగడమే గొప్ప!
మైనర్ విద్యార్థులకు ఒక చిన్న విజ్ఞప్తి…
బైక్ నడిపితే మీరు హీరోలు కాలేరు.
స్నేహితుల ముందు వేగంగా నడిపి చూపిస్తే మీరు గొప్పవారు కాలేరు.
హెల్మెట్ లేకుండా వెళ్లడం స్టైల్ కాదు.
త్రిబుల్ రైడింగ్ ఫన్ కాదు.
అతివేగం ధైర్యం కాదు.
మీ తల్లిదండ్రుల కలలను కాపాడుకోవడం… మీ భవిష్యత్తును కాపాడుకోవడం… అదే అసలైన హీరోయిజం…
మీకు బైక్ నడపాలనే కోరిక ఉంటే తప్పకుండా నెరవేరుతుంది.
కానీ సరైన వయసులో… సరైన లైసెన్స్‌తో… సరైన శిక్షణతో… సరైన బాధ్యతతో..
ఇది ఎవరో ఒకరిని తప్పుబట్టేదికాదు.. ఒక జీవితాన్ని కాపాడే పిలుపు.
తల్లిదండ్రులు — పిల్లలకు వాహనం ఇవ్వకముందు వయసు, చట్టం, భద్రత గురించి ఆలోచించాలి.
ఉపాధ్యాయులు పాఠశాల గేటు దగ్గరే బాధ్యత ప్రారంభించాలి….
పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులు వాహనాలతో వస్తున్నారా లేదా పరిశీలించాలి.
పోలీసులుమైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలి.
సంబంధిత అధికారులు పాఠశాలలు, కళాశాలల వద్ద అవగాహన కార్యక్రమాలతో పాటు అవసరమైన తనిఖీలు నిర్వహించాలి.
విద్యార్థులు నా జీవితం నా చేతుల్లోనే ఉంది* అనే విషయాన్ని గుర్తించాలి.
ఇకనైనా మేల్కోండి.ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు… ప్రమాదం జరగకముందే అడ్డుకోండి…
ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తేనే జీవితం అందంగా ఉంటుంది.
చిన్న వయసులో చదువుపై దృష్టి…
యువ వయసులో లక్ష్యంపై దృష్టి…
సరైన వయసులో డ్రైవింగ్…
జీవితాంతం భద్రత…
ఇదే మన పిల్లలకు ఇవ్వాల్సిన నిజమైన స్వేచ్ఛ!
వరదయ్యపాలెం మండల కేంద్రంలో మైనర్ విద్యార్థుల బైక్ రైడింగ్‌పై ఇకనైనా సంబంధిత అధికారులు, పోలీసులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా దృష్టి పెట్టాలి.
ఏది ఏమైనా
ఒక బైక్ ఆపితే ఒక ప్రయాణం ఆగుతుంది…
కానీ ఒక ప్రాణం కాపాడితే ఒక కుటుంబం నిలబడుతుంది
ఇది విమర్శ కాదు.ప్రమాదం రాకముందే మేల్కొలిపే సామాజిక హెచ్చరిక.
ఇది ఒక మండలానికే పరిమితమైన సమస్య కాదు ఇది… సత్యవేడు నియోజకవర్గ మొత్తం అధికారులు అప్రమత్తమై ఏకతాటిపై… ఏకాగ్రతతో తీసుకోవలసిన చర్యలు…
చూడాలి మరి ఏ విధంగా స్పందిస్తారో…
Tags: You don’t become a hero just by having a bike.