మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 11:30 గంటలైనా ప్రారంభం కాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో తాజ్ మన్సుర్ ముందురోజే గురువారం అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులకు సర్క్యులర్ జారీ చేశారు. అయితే నిర్ణీత సమయం దాటినా పలువురు హాజరుకాకపోవడంతో సమావేశ మందిరం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. సమయపాలన పాటించాలని పలువురు కోరుతున్నారు.
Tags;Mandal general body meeting yet to start even at 11:30.