రేణిగుంట ముచ్చట్లు:
ఆదివారము ఉదయము 11.00 గంటల నుంచి 01.00 గంటల వరకు రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయము నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించబడినది. డాక్టర్ కె హిమజా బాయి, ఇంచార్జ్ డాక్టర్, మరియు ఏ స్వర్ణలత, చీఫ్ ఫార్మసిస్ట్, సి. ఆర్. ఎస్. సబ్ డివిజనల్ ఆసుపత్రి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారిని పెన్షనర్ అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్లు, మహిళా పెన్షనర్లు శాలువులతో సత్కరించారు. తదనంతరం వారు పెన్షనర్లను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రాంచ్ చైర్మన్ ఎస్ అసన్ సాహెబ్, సెక్రటరీ జి జయంత్ కుమార్ ప్రసంగించారు. ముఖ్య అతిథులు మరియు మహిళా పెన్షనర్లు కలసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేకును కట్ చేసి తమ సంతోషాన్ని అందరితో పాల్పంచుకున్నారు. తర్వాత అతిధులకు మరియు మహిళ పెన్షన్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట గ్రామ సర్పంచి ఆర్ నగేష్, ఆఫీస్ బ్యారర్లు వి రామమూర్తి, యం అప్పారెడ్డి,వి షణ్ముగం జి రాజేంద్రప్రసాద్, ఆర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్ ఎస్ జ్ఞానశేఖర్, సి జయ శీలన్, బి రాజేంద్రన్, పి వెంకటేశ్వర్లు, అబ్దుల్ సలీం, తిమ్మా రెడ్డి , షరీఫ్, వరలక్ష్మి మొదలగువారు పాల్గొన్నారు. ఇట్లు జి జయంత్ కుమార్ సెక్రెటరీ.
Tags: International Women’s Day