పల్నాడు ముచ్చట్లు:
పెదకూరపాడులో ఉపాధ్యాయుడిపై యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్‌బాబు సహచర సిబ్బందితో కలిసి కారులో పాఠశాలకు వెళ్తుండగా సిరిపురం వద్ద మరో కారుతో స్వల్పంగా ఢీకొన్నట్లు సమాచారం.ఈ విషయమై కారు యజమాని షేక్ సుభాని, అతని స్నేహితులు ఉపాధ్యాయుడి కారును వెంబడించి పాఠశాల సమీపంలో అడ్డుకున్నారు. అనంతరం నరేష్‌బాబును కిందకు లాగి చేతులతో, కొబ్బరి మట్టలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Attack on teacher… Youths create a ruckus!