మొక్కను బహూకరించి మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న ‘సర్’ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గురువారం మదనపల్లెకు విచ్చేసిన స్పెషల్ అబ్జర్వర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఐఏఎస్ ని ,జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు.స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పెషల్ అబ్జర్వర్‌కు ఎస్పీ గారు పూలమొక్కను బహూకరించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియ అమలుపై అధికారులు కొద్దిసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ కూడా పాల్గొన్నారు.
Tags ‘Sir’ Special Observer’s visit to Madanapalle