అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 20 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు.ఈ జట్టు ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో మైలవరంలో జరిగే అంతర్ జిల్లా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది. ముఖ్య అతిథిగా జునైద్ అక్బరీ హాజరై క్రీడాకారులను అభినందించగా, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె. మురళీధర్ ఆధ్వర్యంలో ఎంపికలు విజయవంతంగా జరిగాయి.
Tags: Selection for the Annamayya District Senior Men’s Football Team