August 27, 2026
Explore
బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..!

బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..!

August 27, 2026 | Andhra Pradesh

నేపాల్ వరదలకు ఇదే కారణమా..?

నేపాల్ ముచ్చట్లు:

నేపాల్, టిబెట్‌ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం… హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఆ భారీ మంచుకొండ ఏకంగా 4 వేల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది.

అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో… భారీగా మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి… దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

మంచుకొండ పడిన ప్రాంతం… బాంబు పేలినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

అంటే…

ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా..?

లేక…

హిమాలయాల్లో భారీ మంచుకొండ విరిగిపడి… దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగిందా..?

అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం.

ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం…

మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద…

హిమాలయాల్లో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Tags:The snow-capped mountain collapsed like a bomb blast!