తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు మ్యాంగోనగర్ కూడలిలో రాత్రి నెల్లూరు జిల్లా కనిగిరి కి చెందిన సుబ్బారెడ్డి రక్తపు మడుగులో పడి వుండగా స్థానికులు గుర్తించారు.
గత కొంత కాలంగా దామలచెరువు పరిసర ప్రాంతాలలో పనులు చేసుకుంటూ వుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గుర్తుతెలియని కారణాలతో గొంతు వద్ద తీవ్ర గాయమై రోడ్డు పై పడివుండగా 108లో తిరుపతి ఆసుపత్రికి తరలించారు.పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: A man found in a pool of blood by the roadside in Damalacheruvu…