పుంగనూరుముచ్చట్లు:
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న అన్ని ఓట్లు సరి చేసుకుని , మ్యాపింగ్ చేయాలని , ఒక ఓటు పోయిన నష్టపోయే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి బిఎల్‌ఏలను, పార్టీ క్యాడర్‌కు సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో మున్సిపాలిటి, రూరల్ మండల నాయకులు, బిఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌సిపి ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఎక్కువుగా తొలగిస్తారని సమాచారం ఉందన్నారు. ఈ విషయంలో బిఎల్‌ఏలు, పార్టీ నాయకులు పకడ్భంధిగా ఓట్ల మ్యాపింగ్ చేపట్టాలన్నారు. ఎలాంటి అక్రమాలు జరిగిన తక్షణమే ఫిర్యాలు చేయాలని సూచించారు. నిర్లక్షం చేస్తే నష్టపోతామనే విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము , బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఉమ్మడి జిల్లాల ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఇర్ఫాన్,అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Not a single vote should be lost in SIR.