August 26, 2026
Explore
మూడు రోజులు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ

మూడు రోజులు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ

August 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ పట్టణ న్యాయవాదులు మూడు రోజుల పాటు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ బుధవారం తెలిపారు. రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు తీవ్రమైందన్నారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈనెల 27, 28 , 29 తేదీలలో మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. న్యాయవాదులు , కక్షిదారులు సహకరించి, జయప్రదం చేయాలని కోరారు.

Tags: Lawyers boycott court duties for three days.