పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కుమ్మరవీధిలో గల మఖాన్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం పెద్దలు ఇనాయతుల్లా షరీఫ్, కరీముల్లా, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, మైనార్టీ నాయకులు యూసుఫ్, అస్లాంమురాధి, నయాజ్, మమ్ము, అమ్ముకుట్టి ల ఆధ్వర్యంలో ముస్లింలు అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించి, ఇందిరా సర్కిల్‌లో ప్రార్థనలు నిర్వహించారు. రాతిమసీదులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Tags: Milad-un-Nabi celebrations held on a grand scale