పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై బుధవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు రొంపిచెర్ల, 11 కి కల్లూరు, 12 కి సదుం, 2:30 కు సోమల, 3:30 కి చౌడేపల్లె, 4:30 కి మున్సిపాలిటి, 5 గంటలకు రూరల్ మండలంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్లు, మండల ఇన్‌చార్జ్లు పాల్గొని , బిఎల్‌ఏలు, పార్టీ వివిధ విభాగాల ప్రతినిదులు, గ్రామస్థాయి క్యాడర్‌తో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: Special meetings on SIR on the 26th