పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నక్కబండలో గల దర్గాలో ఉరుసు కార్యక్రమం నిర్వహించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలు ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము తో కలసి ఉరుసు మహ్గత్సవం పోస్టర్లను విడుదల చేశారు. నాగభూషణం మాట్లాడుతూ ఉరుసుకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ముస్లింలు భక్తిశ్రద్దలతో ఉరుసు కార్యక్రమాన్ని హిందూసోదరులతో కలసి నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజీజ్, కొండవీటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: MLA Peddireddy provides financial assistance to Urusuku.