August 25, 2026
Explore
రైతు సమాఖ్య సమావేశం

రైతు సమాఖ్య సమావేశం

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని కల్లుపల్లె గ్రామంలో గల సుగుటూరు గంగమ్మ రైతు సమాఖ్య 5వ వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. డీసిసి బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ అయేషా , ఏపి మాస్‌ సంస్థ మేనేజర్‌ రమేష్‌రెడ్డి ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయేషా మాట్లాడుతూ ఎలినినో కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతోందని , వరి, చెరకు లాంటి పంటలకు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలన్నారు. అలాగే ఆరుతడి పంటలను సాగుచేస్తూ వర్షపునీటిని ఫారంఫాండ్‌లలో నిల్వచేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.

Tags: Farmers’ Federation Meeting