August 25, 2026
Explore
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

స్థానిక ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న సిబ్బందిని తక్షణమే రెగ్యులర్‌ చేయాలని ఉద్యోగులు నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. మంగళవారం ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వశాఖలలో ఏళ్లతరబడి తక్కువ వేతనంతో ఉద్యోగ భద్రత లేకుండ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులర్‌ చేసి, సమానపనికి సమానవేతనం చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై తక్షణమే స్పందించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ మేరకు మెడికల్‌ ఆఫీసర్‌ మధుసూదనాచారి కి వినతిపత్రం అందజేశారు.

Tags: Contract employees should be regularized.