August 25, 2026
Explore
నీటి కోసం మహిళలు ధర్నా

నీటి కోసం మహిళలు ధర్నా

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఓబిరెడ్డిపల్లె గ్రామంలో మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆగ్రామ మహిళలు మండల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మంగళవారం మహిళలు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. గత మూడు నెలలుగా నీటి సమస్యతో బాధపడుతున్న అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. నీరు లేకపోవడంతో వ్యవసాయబోర్ల వద్ద డబ్బులతో నీటిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇకనైన అధికారులు స్పందించాలని కోరారు.

Tags: Women stage protest for water.