August 25, 2026
Explore
వాహనం అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

వాహనం అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు సమీపంలో గల బైపాస్‌ రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు గాయపడిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. రామసముద్రం మండలం మినికి గ్రామానికి చెందిన నారాయణప్ప(65), ఆయన మనవడు హర్ష (14) ఇరువురు ద్విచక్రవాహనంలో పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో కోర్టు వద్ద వాహనం అదుపుతప్పి క్రిందపడ్డారు. నారాయణప్పకు రక్తగాయాలైంది. ఆయన మనవడికి స్వల్పగాయాలైంది. స్థానికులు గమనించి ఇరువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Two injured after vehicle loses control