March 8, 2026
Explore
శ్రీ సీతారామ మందిరం మహాకుంభాభిషేక మహోత్సవం

శ్రీ సీతారామ మందిరం మహాకుంభాభిషేక మహోత్సవం

March 8, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం,పొయ్య గ్రామంలో శ్రీ సీతారామ మందిరం మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు.

ముందుగా వారికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు మరియు ఆయన సతీమణి ఎంపీపీ నిర్మలమ్మ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పొయ్య గ్రామస్తులు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Sri Sitarama Temple Mahakumbhabhishekam