August 24, 2026
Explore
ఆగస్టు 29న బి.కొత్తకోట లో జాబ్ మేళా

ఆగస్టు 29న బి.కొత్తకోట లో జాబ్ మేళా

August 24, 2026 | Andhra Pradesh

.. పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

మదనపల్లి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 29న బి.కొత్తకోటలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు.

జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్ పీజీఆర్ఎస్ హాల్‌లో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (ఏపీఎస్‌ఎస్‌డీసీ) తదితరులు పాల్గొన్నారు.

జాబ్ మేళాలో ఐసీఐసీఐ బ్యాంక్ (ఎన్‌ఐఐటీ), వాల్ట్‌స్ఫియర్ ఏఐ టెక్నాలజీస్, ఎల్‌ఎంఎస్ కార్పొరేట్ సర్వీసెస్, ఇంటర్న్‌షాలా ఇన్నోవేషన్, అమర రాజా, ఎస్‌ఎస్‌కేజీ బిజినెస్ సర్వీసెస్, యంగ్ ఇండియా, ముత్తూట్ ఫైనాన్స్, టిటీజీ హెచ్‌ఆర్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో ఫార్మసీ, శబరి మ్యాన్‌పవర్ తదితర 12 సంస్థలు పాల్గొననున్నాయి.

వివిధ సంస్థల్లో రిలేషన్‌షిప్ మేనేజర్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, అసెంబ్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ, బ్రాంచ్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, మెషిన్ ఆపరేటర్, డేటా ఎంట్రీ, ప్రొడక్షన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, టెలీకాలర్, ఫార్మసీ ట్రైనీ, ఫార్మసిస్ట్, ప్రొడక్షన్ ట్రైనీ, సర్వీస్ ట్రైనీ తదితర ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ జాబ్ మేళాలో సుమారు 700 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

ఉద్యోగ ప్రదేశాలు అన్నమయ్య జిల్లా, పుంగనూరు, మదనపల్లె, గుర్రంకొండ, చిత్తూరు, బెంగళూరు, హోసూరు, తెలంగాణ తదితర ప్రాంతాల్లో ఉంటాయి. ఉద్యోగం, విద్యార్హతలను బట్టి నెలకు రూ.12,000 నుంచి రూ.35,000 వరకు, కొన్ని ఉద్యోగాల్లో సంవత్సరానికి రూ.3.12 లక్షల వరకు వేతనం లభించనుంది. వయోపరిమితి సంస్థ, ఉద్యోగాన్ని బట్టి 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది.అర్హత కలిగిన యువతీ యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటా/రెజ్యూమ్‌తో పాటు అవసరమైన ఇతర పత్రాలను తీసుకొని ఆగస్టు 29న బి.కొత్తకోట ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కోరారు.

Tags: Job fair in B.Kothakota on August 29th