August 24, 2026
Explore
ప్రభుత్వ ఆశయాలు.. సిద్ధాంతాల మేరకు లక్ష్యసాధనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలి

ప్రభుత్వ ఆశయాలు.. సిద్ధాంతాల మేరకు లక్ష్యసాధనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలి

August 24, 2026 | Andhra Pradesh

కలెక్టర్ల సదస్సుకు పక్కగా నివేదికలు రూపొందించాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు.. సిద్ధాంతాల మేరకు ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం మదనపల్లి కలెక్టరేట్ నందు ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన సమావేశ హాలు ‘భారత్’లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ నూతన సమావేశ మందిరం ‘భారత్’ నూతన అన్నమయ్య జిల్లాకు ప్రతిబింబంగా — ఎదుగుతున్న(Rising), వెలుగొందుతున్న(Shining) మరియు బలమైన(Strong) జిల్లాగా రూపుదిద్దుకునేలా నిర్మించి, డిజైన్ చేయబడిందన్నారు. ఈ నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎంతో కష్టపడి పనిచేసి సమావేశ హాలు సుందరంగా తీర్చిదిద్దిన జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రమేష్ రెడ్డి, గతంలో DPREOగా పనిచేసిన చంద్రశేఖర్ లను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 3, 4 తేదీలలో అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల లక్ష్యాలు, సాధించిన ప్రగతి, 100 రోజుల ప్రణాళిక మరియు విజన్ 2047 ప్రణాళికలలో భాగంగా నిర్దేశించుకున్న ఆయా అంశాలలో తీసుకున్న మరియు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించి చేపట్టాల్సిన కార్యాచరణ పై దిశానిర్దేశం చేశారు. అలాగే ఆయా విభాగాలకు సంబంధించిన అంశాలు, తీసుకున్న చర్య మరియు ప్రస్తుత స్థితి, చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర నివేదికలు పక్కాగా రూపొందించి సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Tags: One must work responsibly to achieve goals in alignment with the government’s vision and principles.