అమరావతిముచ్చట్లు:
దేశీయ పశు జాతుల పరిరక్షణలో అస్సాం మరో కీలక ముందడుగు వేసింది. పశు సంవర్ధక, బయోటెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అస్సాంకు చెందిన ప్రసిద్ధ స్వదేశీ ‘లఖిమి’ జాతి పెయ దూడ ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫలదీకరణ) పద్ధతిద్వారా జన్మించింది. రాష్ట్రంలో పశు సంపద సంరక్షణ, పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్న అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘రాష్ట్రీయ గోకుల మిషన్’ ఆర్థిక సహాయంతో యూనివర్సిటీ ప్రయోగశాలలో దీనికి సంబంధించిన ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన లఖిమి జాతి ఆవు పిండం ద్వారా ఈ దూడను ఉత్పత్తి చేశారు.
Tags: Assam takes another significant step forward in the conservation of indigenous cattle breeds.