March 26, 2026
Explore
బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

March 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభించారు. ఆలయ అర్చకుల వేదమంత్రాలతో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి, ప్రాకారోత్సవం నిర్వహించి పూజలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags; Brahmotsavams Begin