పుంగనూరుముచ్చట్లు:
శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని పట్టణంలోని పలు దేవాలయాల్లోను, ఇండ్లలోను శ్రావణ శుక్రవార పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అమ్మవార్లను వివిధ రూపాలలో అలంకరించి , పూజలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మను కరెన్సీ నోట్లతో అలంకరించారు. అలాగే శ్రీబోగనంజుండేశ్వస్వామి ఆలయంలో పార్వతిదేవిని, శ్రీకళ్యాణ వెంకట్రమణస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలల్లో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags:Sravana Friday prayers celebrated with grandeur.