August 20, 2026
Explore
శ్రావణమాసపూజలకు సర్వంసిద్ధం

శ్రావణమాసపూజలకు సర్వంసిద్ధం

August 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

శ్రావణమాసం తొలి పండుగ శ్రీవరమహాలక్ష్మీ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు మహిళలు సర్వం సిద్ధం చేశారు. గురువారం పట్టణంలో ప్రజలు పూజలకు అవసరమైన అరటి మొక్కలు, చెరకుగడలు, మామిడి ఆకులు, వివిధ రకాల పూలను కొనుగోలు చేశారు. అలాగే మహిళలు మట్టిగాజులు, నూతన వలు కొనుగోలు చేశారు. పండుగ కోసం వారి ఇండ్లలో తమ శక్తి మేరకు బంగారు, వెండితో చేసిన మహాలక్ష్మీ అమ్మవారిని సుందరంగా అలంకరించి , అమ్మవారికి నూతన కరెన్సీ నోట్లను పెట్టి పూజలు చేయడం , వివిధ రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. పండుగ సందర్భంగా పట్టణం జనంతో కిటకిటలాడింది.

Tags; Everything is ready for the Shravana month rituals.