August 20, 2026
Explore
15,432 ఓటర్లలో వ్యత్యాసాలు-ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి.

15,432 ఓటర్లలో వ్యత్యాసాలు-ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి.

August 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో నియోజకవర్గంలో 15,432 మంది ఓటర్లలో రకరకాల వ్యత్యాలు కారణంగా మ్యాపింగ్‌ చేయంలో పెండింగ్‌లో ఉందన్నారు. గురువారం ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తహశీల్ధార్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 286 పోలీంగ్‌ స్టేషన్లలో 2,15,071 మంది ఓటర్లు ఉండగా ఇందులో 5,145 ఓటర్లకు మ్యాపింగ్‌ జరగలేదన్నారు. అలాగే 15,342 మంది ఓటర్లకు రకరకాల పోరపాట్లతో మ్యాపింగ్‌ పెండింగ్‌లో ఉందన్నారు. అన్నిపార్టీల నాయకులు సహకరించి, పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సిపి నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్‌, అమ్ము, అజిజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Discrepancies found among 15,432 voters – ERO Chandrashekhar Reddy.