అమరావతిముచ్చట్లు:
❇️వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలతో మోసపూరిత రుణ యాప్‌లతో సహా మొత్తం 3,718 మొబైల్ యాప్‌లను కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.
❇️ఈ ఏడాది జూన్ 30 వరకు ఐటీ చట్టం-2000లోని 69(ఏ), 79(3)(బీ) సెక్షన్ల కింద మోసపూరిత రుణ యాప్‌లతో సహా మొత్తం 3,718 మొబైల్ యాప్‌లను భారతీయ సైబర్ క్రైమ్ సమన్వయ సెంటర్ నిలిపివేసింది(బ్లాక్ చేసింది) అని ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన చెప్పారు. వివిధ పోలీసు విభాగాల నివేదికల ప్రకారం 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను కేంద్రం బ్లాక్ చేసిందని మంత్రి తెలిపారు.
Tags: Centre reveals 3,718 mobile apps blocked.