-క్రిమినల్ కేసు పూర్తిగా కొట్టివేత!
అమెరికా ముచ్చట్లు:
గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా ఫెడరల్ కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసును ఇకపై కొనసాగించబోమని అమెరికా న్యాయశాఖ నిర్ణయించడంతో ‘ఇక మళ్లీ ఇదే ఆరోపణలతో కేసు పెట్టడానికి లేదు’ అంటూ జడ్జి డిస్మిస్ చేశారు. అయితే ఈ నిర్ణయంపై ఫెడరల్ జడ్జి కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికా న్యాయశాఖలోని సీనియర్ అధికారి ట్రెంట్ మెక్‌కాటర్ కేసును దర్యాప్తు చేసిన అధికారులను పక్కనపెట్టి అదానీ లాయర్లతో నేరుగా చర్చలు జరపడం ఏంటని జడ్జి ప్రశ్నించారు. అయితే ఒక విషయం మాత్రం క్లియర్. ఇది ట్రయల్ జరిగి అదానీ నిర్దోషిగా తేలిన తీర్పు కాదు. అమెరికా ప్రభుత్వం ఈ కేసును ఇక కొనసాగించకూడదని నిర్ణయించింది. దీంతో కోర్టు కూడా కేసును పూర్తిగా ముగించింది. మరి ఇంత పెద్ద కేసును అమెరికా ప్రభుత్వం ఎందుకు వదిలేసింది? కానీ… ఈ కేసు ముగిసినా ఈ ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది.
Tags: Sensational turn in the Adani case!!