August 12, 2026
Explore
అర్జెంట్‌గా రమ్మని పిలిచి.. ప్రియుడి చేత భర్తని చంపించిన భార్య

అర్జెంట్‌గా రమ్మని పిలిచి.. ప్రియుడి చేత భర్తని చంపించిన భార్య

August 12, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని బుధానా ప్రాంతంలో ఘటన

మీరట్‌కు చెందిన తాలిబ్‌కు మీనా అనే యువతితో వివాహం

అయితే పెళ్లికి ముందే ఆసిమ్ అనే అబ్బాయిని ప్రేమించిన మీనా

పెళ్లయిన తర్వాత కూడా వివాహేతర బంధం కొనసాగించింది

ఈ క్రమంలోనే.. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని ప్రియుడితో కలిసి మీనా ప్లాన్

వెల్డింగ్ పని కోసం గుజరాత్‌కు వెళ్లిన తాలిబ్‌ను అర్జెంట్‌గా రమ్మని బుధానాకు మీనా పిలిచింది

దీంతో తాలిబ్ ఊరికి తిరిగి రాగా.. అతనిపై గొడ్డలితో విరుచుకుపడ్డాడు మీనా ప్రియుడు ఆసిమ్

17 సార్లు గొడ్డలితో దాడి చేసి ఆసిమ్ పరార్.. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తాలిబ్

వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన తాలిబ్

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

BNS సెక్షన్లు 103 (హత్య), 61-2 (నేరపూరిత కుట్ర) కింద మీనాపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు

మరోవైపు.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిపిన ఆసిమ్

ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. ఆసిమ్ కాలికి తగిలిన బుల్లెట్

Tags: Wife summons husband urgently and has him killed by her lover.