March 26, 2026
Explore
మార్కాపురం బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

మార్కాపురం బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

March 26, 2026 | Andhra Pradesh

మార్కాపురం ముచ్చట్లు:

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం ఎంతో బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపగా, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Tags: Minister Mandipalli Expresses Shock over Markapuram Bus Accident