August 10, 2026
Explore
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం!

రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం!

August 10, 2026 | Andhra Pradesh

రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!

రాజమండ్రి ముచ్చట్లు:

రాజమండ్రిలో కారుతో ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన మెడికో విద్యార్థి ప్రియాంక కేసు దర్యాప్తు వేగం పెంచారు పోలీసులు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కఠిన చట్టాలను అతనిపై మోపారు.

ప్రియాంక తండ్రి వెంకటేష్‌ తన కుమార్తెను కోల్పోయిన బాధలో ఉండగా, ఒక వర్గం మీడియా ఆయన చేసిన కామెంట్స్‌ను వక్రీకరించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపట్టినట్టు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులపై తమకు నమ్మకం ఉందని, నిందితులకు శిక్ష పడుతుందని వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రియాంక మృతిపై రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మద్యం మత్తులో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న నిందితులకు కఠిన శిక్ష ఖాయమని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. హోంమంత్రి అనిత, మరో మంత్రి రామానాయుడు కూడా బాధితురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్న ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Tags: Investigation into the death of Rajahmundry medical student Priyanka accelerated!