రాజమండ్రి ముచ్చట్లు:
గతవారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక చివరకు ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఇవాళ ఆమెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రియాంక స్వగ్రామమైన జోగులాంబ గద్వారా జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్ గ్రామంలో ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు కుటుంబ సభ్యులు.
రాజమండ్రిలో ప్రమాదానికి గురైన.. సుమారు ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన మెడికో ప్రియాంక అంతక్రియలు నేడు జరగనున్నాయి. ఆమె స్వాగ్రామమైన జోగులాంబ గద్వారా జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్ గ్రామంలో ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం ప్రియాంక బాడీని స్వగ్రామానికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. దాదాపు మధ్యాహ్నంలోపు ప్రియాంక డెడ్‌బాడీ తన ఇంటికి చేరుకోనుంది. ఆ తర్వాత అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అయితే ప్రియాంక సొంతగ్రామం ఏక్లాస్ పూర్.. ఆమె రెండో తరగతి వరకు ఏక్లాస్ పూర్ మండలమైన ఐజలో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత పిల్లల చదువుల కోసమని ప్రియాంక తల్లిదండ్రులు కర్నూల్‌లో స్థిరపడ్డారు. దీంతో అక్కడే మిగతా చదువును ఆమెను కంటిన్యూ చేసింది. అయితే ప్రియాంక చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణించేది. ప్రియాంకకు ఇద్దరు చెల్లెల్లు కూడా ఉన్నారు.. ఆమె పెద్ద కూతురు కావడంతో కష్టపడి చదివి మెడిసిన్‌లో సీటు సాధించి, ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని GSL మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చేస్తున్న ప్రియాంక ఇటీవల తన స్నేహితుడితో కలిసి.. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసేందు వెళ్లి వస్తుండగా.. మధ్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కార్‌తో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో ఉన్న కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Tags: Medico Priyanka’s last rites to take place in a few hours… Do you know where her native village is?