ఓబులవారిపల్లి ముచ్చట్లు:
ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల ప్యాసింజర్ రైలును ఎక్కే ప్రయత్నంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రెడ్డయ్య ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి రైలు కిందపడ్డ అతడిని సురక్షితంగా బయటికి తీశారు. అయితే అప్పటికే అతని కుడి కాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
గాయపడిన విద్యార్థిని హుటాహుటిన రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.
రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. అధికారులు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags: Accident While Attempting to Board Train: Student Sustains Severe Injuries