August 9, 2026
Explore
వేధింపులు..తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

వేధింపులు..తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

August 9, 2026 | Andhra Pradesh

అయ్యో పాపం..! 4 నెలలుగా నో వీక్లీఆఫ్.. పైగా వేధింపులు..తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ!

మైసూరుముచ్చట్లు:

మైసూరు ప్రాంతానికి చెందిన నాగేశ్వరి అనే యువతి స్థానికంగా ఉన్న ఓ సంస్థలో ప్రాడక్ట్‌ ప్రమోటర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలుకోల్పోయింది. అయితే గత 15 రోజులుగా నాగేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని, ఆఫీస్‌లో తనకు వేధింపులు ఎక్కవయ్యాయని.. తమతో చెప్పినట్టు నాగేశ్వరి కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోవడానికి ముందు నాగేశ్వరి ఓ లేఖ కూడా రాసింది.
నాగేశ్వరి రాసిన లేఖ ప్రకారం.. తాను ఎలాంటి తప్పలు చేయకపోయినా కావాలనే ఉన్నతాధికారులు తనను టార్గెట్ చేసి.. తీవ్రంగా వేధించేవారని ఆమె పేర్కొంది. గత 4 నెలల నుంచి కనీసం ఒక్క వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వలేదని.. ఎమర్జెన్సీ సమయ్యాల్లో కూడా సెలవులు ఇవ్వలేదని వాపోయింది. ఆఫీస్‌లో తనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తనను జాబ్ నుంచి కూడా తీసేశారని తెలిపింది. ఓ సూపర్ వైజర్‌ వల్లే తాను ఈ సంచలన నిర్ణయం తీసుకున్నానని.. తన చావుకు అతనే కారణమని ఆమె లేఖలో రాసుకొచ్చింది.
ఘటనపై నాగేశ్వరి పేరెంట్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ కూతురి మరణానికి ఆఫీస్‌లోని ఉన్నతాధికారులే కారణమని.. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను పీఎస్‌లో సమర్పించారు. తమ బిడ్డ మరణానికి న్యాయం చేసి.. అందుకు కారకులైన వారిని శిక్ష పడేలా చూడాలని తల్లింద్రడులు పోలీసులను కోరారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:Techie commits suicide, unable to bear harassment.