August 9, 2026
Explore
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చిట్వేలి యువకుడు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చిట్వేలి యువకుడు మృతి

August 9, 2026 | Andhra Pradesh

చిట్వేలి ముచ్చట్లు:

చిట్వేలి మండలంలోని జెట్టివారిపల్లికి చెందిన బొంగు టావుల దిలీప్‌కుమార్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ఐదు నెలల క్రితమే దిలీప్‌కుమార్ అమెరికా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం అందింది. దిలీప్‌ కుమార్ మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దిలీప్‌కుమార్ మృతితో జెట్టివారిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:Road accident in the US: Chitvel youth dies.