నిమ్మనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో అక్రమంగా కలపను తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, కలపను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిమ్మనపల్లి మండలం, దివిటివారిపల్లి వద్ద శనివారం అనుమతి లేకుండా హుసైన్ చెట్లను నరికించాడు. లారీలో కలపను అక్రమంగా తరలిస్తుండగా, ఎఫ్బిఓ దీప లారీని అడ్డుకుంది. రికార్డులను పరిశీలించిన ఎఫ్ఆర్ఓఎలాంటి అనుమతులు లేవని సీజ్ చేశామని తెలిపారు.
Tags;Lorry transporting timber illegally seized.