August 9, 2026
Explore
భూ రికార్డులు ట్యాంపరింగ్‌ చేసిన విఆర్ఓ పై కేసు నమోదు : ఎస్ఐ

భూ రికార్డులు ట్యాంపరింగ్‌ చేసిన విఆర్ఓ పై కేసు నమోదు : ఎస్ఐ

August 9, 2026 | Andhra Pradesh

నిమ్మనపల్లెముచ్చట్లు:


నిమ్మనపల్లె మండలం, రాచవేటివారిపల్లె పంచాయతిలో భూ రికార్డులు ట్యాంపరింగ్‌ చేసిన వీఆర్ఓ పై నిమ్మనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. మండలంలోని రాచవీటివారి పల్లె పంచాయతీ వీఆర్ ఓ గా పని చేస్తున్న సోమశేఖర్ పంచాయతీకి సంబంధించిన ఏ-రిజిస్టర్‌ ట్యాంపరింగ్ చేసి పలు సర్వే నెంబర్లను తారుమారు చేసినట్లు తహసిల్దార్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తహసిల్దార్ రికార్డులను పరిశీలించి, వాటికి సంబంధించిన భూముల వివరాలు, పేర్లను మార్చేసినట్లు గుర్తించి అనంతరం విఆర్ఓ పై చర్యలకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై రామకృష్ణ వీఆర్ ఓ పై కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు.

Tags;Case registered against VRO for tampering with land records: SI