చిన్నమండెం ముచ్చట్లు:
చిన్నమండెం మండలంలోని బోడిరెడ్డిగారిపల్లెలో విరూపాక్షమ్మ జాతర సందర్భంగా ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ విందు నిర్వహించనున్నారు. విందు ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ విందుకు సుమారు 30 వేల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌ఎండీ ఫరూక్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరుకానున్నారు.
వీరితో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య, పలువురు పార్టీ నాయకులు పాల్గొననున్నారు. పరిసర జిల్లాల నుంచి కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. విందు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 120 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
Tags: Ministers to visit Bodireddygaripalle today.